Uttar Pradesh: యూపీలో విడ్డూరం... ఈవీఎంలను ఏ పార్టుకు ఆ పార్టు విప్పదీసి ఏముందో చూసిన సిబ్బంది
- యూపీలోనూ ఈసీపై విమర్శలు
- ఈవీఎంలు లోపభూయిష్టం అంటూ ఆరోపణలు
- సిబ్బంది చేష్టలతో స్థానికుల విస్మయం
దేశంలో రెండో దశ పోలింగ్ గురువారం జరగనుంది. యూపీ (8), కర్ణాటక (14), మహారాష్ట్ర (10), అసోం (5), బీహార్ (5), చత్తీస్ గఢ్ (3), పశ్చిమ బెంగాల్ (3), జమ్మూకాశ్మీర్ (2), మణిపూర్ (1), త్రిపుర (1), ఒడిశా (5) రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే, యూపీలో పోలింగ్ ఏర్పాట్లపై విమర్శలు వినిపిస్తున్నాయి. లోపాలతో ఉన్న ఈవీఎంలను పోలింగ్ సిబ్బందికి అందజేసినట్టు వార్తలు వస్తున్నాయి. దానికితోడు సిబ్బంది నిర్వాకం కూడా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఈవీఎంలను ఏ భాగానికి ఆ భాగం విడదీసి అందులో ఏముందో చూస్తూ ఈవీఎంల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది చేష్టలు స్థానికులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈవీఎంలను వాళ్లు ఎందుకు విప్పదీస్తున్నారంటూ ఆగ్రా తదితర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.