YSRCP: కోడెల చాలా అహంకారపూరితంగా మాట్లాడారు: అంబటి రాంబాబు

  • ‘చంద్రబాబుకు జగన్, నాకు అంబటి రాంబాబు పోటీనా?’అని కోడెల అంటారా?
  • ఇలా మాట్లాడటం తగదు
  • అహంకారపూరితంగా మాట్లాడొద్దు

‘చంద్రబాబుకు జగన్ పోటీనా? నాకు అంబటి రాంబాబు పోటీనా?’ అంటూ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోవడం వల్లే జగన్ సీఎం కాలేకపోయారని, అదే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి తనపై పోటీ చేసిన కోడెలకు కేవలం 924 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చిందని, ఈ విషయాలు కోడెలకు గుర్తులేవా అని ప్రశ్నించారు.

కించపరిచే విధంగా, అహంకారపూరితంగా కోడెల మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. ‘బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతి’ అన్న పద్యం కోడెల కోసం రాసినట్టు ఉందని సెటైర్లు విసిరారు. కోడెల ఏదో బలవంతుడని ఆయనపై ఎవరూ పోటీ చేయలేరన్నట్టుగా మాట్లాడుతున్నారని, మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజున అసలు విషయం తెలుస్తుందని అన్నారు.

YSRCP
ambati
Telugudesam
kodela
sattenapalli
  • Loading...

More Telugu News