polavaram: ‘పోలవరం’ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలి: అధికారులకు సీఎం ఆదేశం
- పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష
- కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలి
- ఇప్పటి వరకు 69 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది
జులైలో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 69 శాతం, కాంక్రీట్ పనులు 72.40 శాతంతో 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. తవ్వకం పనులు 84.60 శాతం పూర్తయ్యాయని, ఇప్పటివరకూ కుడి ప్రధాన కాల్వ పనులు 90.87 శాతం, ఎడమ ప్రధాన కాల్వ పనులు 70.38 శాతం పూర్తయినట్టు చెప్పారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు 66.22 శాతం, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 40.71 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ పనులు 25.04 శాతం పూర్తయినట్టు వివరించారు.