Andhra Pradesh: నాకు ఎలాంటి షోకాజ్ నోటీసులు అందలేదు.. కలెక్టర్ వివరణ మాత్రమే కోరారు!: కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ దినకర్

  • ఎమ్మార్వోకు ఈసీ సంజాయిషీ నోటీసులు ఇచ్చింది
  • నూజివీడులో పోలింగ్ సందర్భంగా విచిత్రం
  • మొత్తం ఓట్ల కంటే 50 ఓట్లు అధికంగా పోల్

ఎన్నికల సంఘం నుంచి తనకు ఎలాంటి షోకాజ్ నోటీసులు అందలేదని కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. నూజివీడు ఎమ్మార్వోకు మాత్రం సంజాయిషీ నోటీసులు వచ్చాయని అంగీకరించారు. నూజివీడులోని పోలింగ్ వ్యవహారంపై కలెక్టర్ ఇంతియాజ్ తనను వివరణ మాత్రమే కోరారని స్పష్టం చేశారు. నూజివీడులోని ఓ పోలింగ్ బూత్ లో ఈ నెల 11న మాక్ పోలింగ్ సందర్భంగా పడిన ఓట్లను అధికారులు ఈవీఎంల నుంచి తొలగించలేదు.

దీంతో పోలింగ్ ముగిశాక మొత్తం ఓటర్ల కంటే 50 ఓట్లు అధికంగా పోల్ అయినట్లు తేలింది. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ నూజివీడు ఎమ్మార్వోను సస్పెండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే స్వప్నిల్ దినకర్ కు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు కూడా మీడియాలో వచ్చింది. తాజాగా ఈ వార్తలను కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ ఖండించారు.

Andhra Pradesh
Krishna District
collector
ec
nuziveedu
showcause notice
  • Loading...

More Telugu News