PJ Kuriyan: రాహుల్ ప్రసంగానికి కురియన్ మలయాళ అనువాదం... చూస్తే నవ్వాపుకోలేరు మరి!

  • పతనంథిట్టలో కాంగ్రెస్ ప్రచార సభ
  • రాహుల్ ఆంగ్లాన్ని అర్థం చేసుకోలేకపోయిన కురియన్
  • తడబడుతున్న కురియన్ పై రాహుల్ ఆగ్రహం

కేరళలోని పతనంథిట్టలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న వేళ, దాన్ని అనువదించిన కురియన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చూస్తున్న వారిలో నవ్వులు పూయిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవమున్న కురియన్, రాహుల్ ఆంగ్లాన్ని అర్థం చేసుకోవడంలో పడ్డ కష్టం అంతాఇంతా కాదు.

చాలాసార్లు తడబడుతున్న కురియన్ ను చూసి, కాసేపు నవ్వు మొహంతోనే కనిపించిన రాహుల్ , చివరకు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓ దశలో తన మైక్ ను పక్కకు నెట్టి, మలయాళంలో మాట్లాడేందుకు కురియన్ ప్రయత్నించగా, రాహుల్ వారించాల్సి వచ్చింది. చివరకు ఓపిక నశించిన రాహుల్, తన ప్రసంగాన్ని నిలిపివేసి, ఈయన ఇప్పుడే భాష నేర్చుకుంటున్నారా? అని కసిరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

PJ Kuriyan
Rahul Gandhi
kerala
Malayalam
  • Error fetching data: Network response was not ok

More Telugu News