chaitu: వసూళ్ల పరంగా కొనసాగుతున్న 'మజిలీ' దూకుడు

- చైతూ జోష్ పెంచిన 'మజిలీ'
- నైజామ్ ఏరియా వసూళ్లే 10 కోట్లు
- నాగ్ దృష్టిలో పడిన శివ నిర్వాణ
నాగచైతన్య .. సమంత .. దివ్యాన్ష కౌశిక్ ప్రధాన పాత్రధారులుగా 'మజిలీ' సినిమా నిర్మితమైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.
