Andhra Pradesh: చంద్రబాబుతో కోడెల శివప్రసాదరావు భేటీ!

  • ముఖ్యమంత్రితో ఏకాంతంగా భేటీ
  • ఇనిమెట్లలో తనపై జరిగిన దాడిపై వివరణ
  • వైసీపీ దాడిని ఎదుర్కోవడంపై సుదీర్ఘ చర్చ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వచ్చిన కోడెల ముఖ్యమంత్రితో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఇనిమెట్లలో తనపై జరిగిన దాడి ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు.

ఇనిమెట్లలో రిగ్గింగ్ జరుగుతోందని సమాచారం రావడంతో తాను అక్కడకు వెళ్లానని కోడెల తెలిపారు. అయితే తనపై వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  వైసీపీ నేతల దాడిని ఎలా తిప్పికొట్టాలన్న విషయమై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జగన్ నాయకత్వంలో వైసీపీ నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయడంపై కూడా వీరు చర్చించినట్టు తెలిసింది. 

Andhra Pradesh
Chandrababu
Telugudesam
kodela
Jagan
YSRCP
  • Loading...

More Telugu News