Andhra Pradesh: చంపేస్తామని బెదిరింపులు.. టీడీపీ నేత బోండా ఉమపై కేసు నమోదు!

  • విజయవాడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఘటన
  • వైసీపీ అభ్యర్థుల తరఫున కోగంటి సత్యం ప్రచారం
  • అడ్డుకున్న ఉమ, ఆయన కుమారులు

టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమపై కేసు నమోదయింది. వైసీపీ అభ్యర్థులు పొట్లూరి వరప్రసాద్, మల్లాది విష్ణు తరఫున పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీరి ప్రచారాన్ని బోండా ఉమ కుమారులు సిద్ధార్థ్, రవితేజ టీడీపీ కార్యకర్తలతో కలిసి అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఘటనాస్థలికి చేరుకున్న బోండా ఉమ సత్యంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా చంపేస్తానని ఆయన్ను బెదిరించారు. ఈ మేరకు కోగంటి సత్యం విజయవాడలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కోగంటి సత్యం ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 341,506 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Telugudesam
Bonda Uma
warning
Police case
two sons
  • Loading...

More Telugu News