Rajnath Singh: సొంత కారు లేదు... ఎన్నికల అఫిడవిట్ లో రాజ్ నాథ్ సింగ్!

  • ఈసీకి అఫిడవిట్ సమర్పణ
  • పాయింట్ 32, డబుల్ బ్యారల్ గన్ ఉన్నాయి
  • రూ. 5 కోట్ల విలువైన ఆస్తులున్నాయన్న రాజ్ నాథ్

కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సొంత కారు లేదు. వినడానికి ఇది కొంత ఆశ్చర్యంగానే ఉన్నా నిజం. ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. తన వద్ద పాయింట్ 32 బోర్ రివాల్వర్, డబుల్ బ్యారల్ గన్ ఉన్నాయని తెలిపారు. తనతో పాటు తన భార్య పేరిట రూ. 5 కోట్ల విలువైన ఆస్తులున్నాయని, భార్య వద్ద రూ. 26 లక్షల విలువైన 800 గ్రాముల బంగారం ఉందని తెలిపారు.

 చందౌలీ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఐదు హెక్టార్ల వ్యవసాయ భూమి ఉందని, వాణిజ్య స్థలాలు లేవని స్పష్టం చేశారు. లక్నోలోని విపుల్ ఖండ్ లో 272 చదరపు గజాల్లో ఇల్లుందని, దాన్ని తాను 1997లో రూ. 3.60 లక్షలకు కొనుగోలు చేశానని తెలిపారు. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని, 2013-14తో పోలిస్తే 2017-18 నాటికి తన ఆదాయం 45 శాతం మేరకు పెరిగిందన్నారు.

Rajnath Singh
EC
Affidavit
Guns
Car
  • Loading...

More Telugu News