Crime News: యాసిడ్‌ దాడి బాధితురాలికి న్యాయం... నిందితుడికి 11 ఏళ్ల జైలు శిక్ష

  • 2016 మే 16న ఘటన
  • కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో దుర్ఘటన
  • కోరిక తీర్చలేదని మహిళపై ఓబులేసు అనే వ్యక్తి దాడి

దాదాపు మూడేళ్ల తర్వాత యాసిడ్‌ దాడి బాధితురాలికి న్యాయం జరిగింది. ఆమెపై యాసిడ్‌పోసి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తికి పదకొండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఆళ్లగడ్డ ఐదో అదనపు జిల్లా జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన ఓ మహిళను ఓబులేసు అనే వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేస్తుండేవాడు. తన కోరిక తీర్చాలంటూ ఆమె వెంటపడి ఒత్తిడి చేస్తుండేవాడు.

దీనికి ఆమె ససేమిరా అనడంతో ఆగ్రహంతో తట్టుకోలేని ఓబులేసు 2016 మే 16వ తేదీన ఆమెపై యాసిడ్‌తో దాడిచేశాడు. ఈ దాడిలో ఆమె ముఖం, కాళ్లు, చేతులు కాలిపోయాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఓబులేసుని అరెస్టుచేసి కోర్టు ముందుంచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఈ విధంగా తీర్పు చెప్పారు.

Crime News
judgiment
yasid raid
  • Loading...

More Telugu News