ntr: వైస్రాయ్ ఘటనలో చెప్పులు వేసింది ఎన్టీఆర్ మీద కాదు: ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్

- లక్ష్మీపార్వతిపై చెప్పులు వేశారు
- తనపై చెప్పులు వేసినట్టు ఎన్టీఆర్ భావించారు
- ఎన్టీఆర్ వద్దకు భువనేశ్వరి తరచుగా వచ్చేవారు
తెలుగుదేశం పార్టీ చరిత్రలో వైస్రాయ్ దాడి చాలా కీలకమైన అంశం. వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబు ఏర్పాటు చేసిన క్యాంపులో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో లక్ష్మీపార్వతితో కలసి ఎన్టీఆర్ అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో వారిపై చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ పై చెప్పులు విసిరారంటూ ఇప్పటి వరకు అందరూ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్ ఆరోజు ఏం జరిగిందో వివరించారు.
