Devineni Uma: దమ్ముంటే ఆ 40 మంది ఎవరో చెప్పు... కనీసం సాక్షిలో అన్నా రాయించు: జగన్ కు దేవినేని ఉమ సవాల్

  • 40 మంది డీఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారన్న జగన్
  • వారందరూ ఒకే సామాజిక వర్గం వారని ఆరోపణ
  • పేర్లు చెప్పాలని డిమాండ్ చేసిన దేవినేని ఉమ

ఒకే సామాజిక వర్గానికి చెందిన 40 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చామని ఆరోపిస్తున్న వైఎస్ జగన్ కు దమ్ముంటే వారి పేర్లు బయట పెట్టాలని ఏపీ మంత్రి దేవినేని ఉమ సవాల్ విసిరారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఆ 40 మంది ఎవరో, ఏ వర్గానికి చెందిన వారో మీడియాకు చెప్పాలని అన్నారు. కనీసం తన సొంత పత్రికైన సాక్షిలోనైనా వివరాలు రాయించాలని సూచించారు.

ప్రభుత్వంపై అత్యంత దుర్మార్గంగా బురద జల్లడమే జగన్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అన్యాయంగా చీఫ్ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలను బదిలీ చేసిన వేళ, ఈ పదవీ విరమణ చేసిన అధికారులు ఎందుకు ప్రశ్నించలేదని విమర్శించారు. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఏపీపై కుట్రలు జరుగుతున్నాయని, ఆర్థిక ఉగ్రవాది జగన్ కు మద్దతుగా నిలుస్తున్న మోదీ, ఆయన చెప్పినట్టు ఆడుతున్నారని ఆరోపించారు.

Devineni Uma
Jagan
Pramotions
  • Loading...

More Telugu News