Andhra Pradesh: పక్కా ప్లాన్ ప్రకారమే దాడి.. సూత్రధారి అతడే: కోడెల

  • దాడి చేయించింది అంబటి రాంబాబే
  • టీడీపీ నేతలను భయపెట్టి తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అనుకున్నారు
  • మోదీ కూడా చంద్రబాబును ఓడించాలని చూశారు

పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిగిందని ఏపీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ అన్నారు. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబే ఈ దాడికి సూత్రధారి అని ఆరోపించారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన తనపై దాడి చేసి రాష్ట్రమంతటా భయాందోళనలు సృష్టించాలని వైసీపీ నేతలు భావించారన్నారు. ఆ తర్వాత తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అనుకున్నారని అన్నారు. మరోవైపు, ప్రధాని మోదీ కూడా చంద్రబాబును ఓడించాలని చూశారని, వ్యవస్థలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తమకు ఏం కావాలో ఇక్కడి ప్రజలకు తెలుసని, అందుకనే జనం టీడీపీకి ఓటేశారని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News