speaker: జగన్! నీ జీవిత కాలంలో ముఖ్యమంత్రివి కాలేవు: కోడెల శివప్రసాద్

  • జగన్! నీ ప్రవర్తన మార్చుకో
  • కనీసం, రాజకీయ నాయకుడిగా మిగులుతావు
  • లేకపోతే, నీకు ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయి

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత కోడెల శివప్రసాద్ విరుచుకుపడ్డారు. గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ దగ్గర ఉన్న వాళ్లలో చాలా మంది గత్యంతరం లేకనే ఆయన వద్ద ఉన్నారని అన్నారు. జగన్ ప్రవర్తన, మాటలను తట్టుకుని వాళ్లు ఉంటున్నారంటే, టీడీపీలో ఖాళీలు లేకపోవడం వల్లనే అని అన్నారు.

 ‘నీ జీవిత కాలంలో ముఖ్యమంత్రివి కాలేవు. నీ ప్రవర్తన మార్చుకుంటే కనీసం, రాజకీయ నాయకుడిగా అయినా మిగులుతావు. లేకపోతే, ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయి’ అని హెచ్చరించారు. కేసీఆర్ తో కలిసి పని చేస్తానని జగన్ ఎలా చెబుతారు? జగన్ లాంటి వ్యక్తిని ఆంధ్రా ప్రజలు ఎప్పటికీ ఒప్పుకోరని కోడెల అభిప్రాయపడ్డారు. ఆంధ్రా ప్రజలు చైతన్యం, విజ్ఞత ఉన్నవాళ్లని, ఏపీకి ఏం కావాలో ప్రజలకు స్పష్టంగా తెలుసని అన్నారు.  

speaker
kodela
Telugudesam
YSRCP
jagan
AP
  • Loading...

More Telugu News