Andhra Pradesh: ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

  • ఏపీకి నలుగురు న్యాయమూర్తుల పేర్లు సిఫారసు 
  • తెలంగాణకు ముగ్గురు న్యాయమూర్తుల పేర్లు
  • అలహాబాద్ హైకోర్టు నుంచి శ్రీదేవి బదిలీ

ఏపీ, తెలంగాణ హైకోర్టులలో కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులను, తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీకి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఎం.వెంకటరమణ, జస్టిస్ భానుమతి, జస్టిస్ హరిహరనాథ్ శర్మ పేర్లను సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ సుమలత, జస్టిస్ తుకారాంజీ పేర్లను కొలీజియం సిఫారసు చేసింది.

కాగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి నియమితులయ్యారు. అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని జస్టిస్ శ్రీదేవి కొలీజియంకు లేఖ రాశారు. ఆమె అభ్యర్థనను కొలీజియం ఆమోదించింది.

Andhra Pradesh
Telangana
high court
Supreme Court
collegium
justice manavendra
  • Loading...

More Telugu News