BJP: ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో చంద్రబాబు జతకడుతున్నారు: జీవీఎల్

  • ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని స్టాలిన్ చెప్పారా?
  • కర్ణాటక సీఎం కుమారస్వామి మద్దతు ఇచ్చారా?
  • ఏపీ ప్రయోజనాలకు అడ్డుపడుతోంది చంద్రబాబే

డీఎంకేకు చంద్రబాబు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు మద్దతుగా నిలుస్తామని స్టాలిన్ చెప్పారా? ప్రత్యేక హోదాకు కర్ణాటక సీఎం కుమారస్వామి మద్దతు ఇచ్చారా? ప్రత్యేక హోదాకు వారు మద్దతు ప్రకటించనప్పుడు వారిని ఎందుకు సమర్థిస్తున్నారు? అని ప్రశ్నించారు.

ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో చంద్రబాబు జతకడుతున్నారని, ఏపీ ప్రయోజనాలకు అడ్డుపడుతోంది చంద్రబాబేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతిస్తే చంద్రబాబు విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా జీవీఎల్ ప్రస్తావించారు.

BJP
Gvl
Telugudesam
Chandrababu
dmk
stalin
  • Loading...

More Telugu News