Badminton: ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూశాడు, అదీ జగన్ చరిత్ర!: లంకా దినకర్

  • క్రీడాభివృద్ధికి పుల్లెలకు చంద్రబాబు స్థలమిచ్చారు
  • ఆ స్థలాన్ని కబ్జా చేయాలని జగన్ చూశాడు
  • కబ్జా కాకుండా పుల్లెల పోరాడి నిలుపుకున్నాడు

 టీడీపీ నేత లంకా దినకర్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. సింధు గురువు పుల్లెల గోపీచంద్ కు బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధి నిమిత్తం నాడు చంద్రబాబు హయాంలో స్థలం ఇచ్చామని, ఆ స్థలాన్ని జగన్ తో సహా వైఎస్ కుటుంబం కబ్జా చేయాలనుకుందని దినకర్ ఆరోపించారు. ఆ స్థలం కబ్జాకు గురికాకుండా పుల్లెల గోపీచంద్ పోరాడి నిలుపుకున్నారని అన్నారు. అదీ జగన్ చరిత్ర అని, జగన్ ఏ ఉదాహరణ చెప్పినా దాని వెనుక ఆయన, ఆయన కుటుంబసభ్యుల హస్తం ఉంటుందని ఆరోపించారు. ఈవీఎంలను ఉంచే స్ట్రాంగ్ రూమ్స్ ని ఇడుపులపాయలో జగన్ నివాసంలో ఉండే స్టోర్ రూమ్ అనుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Badminton
pullela
PV Sindhu
YSRCP
jagan
  • Loading...

More Telugu News