tarun bhaskar: విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న సినిమాలో తమిళ టీవీ నటి

  • నిర్మాతగా విజయ్ దేవరకొండ 
  • ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్ .. అనసూయ
  •  ముఖ్యమైన పాత్రలో వాణి భోజన్

 విజయ్ దేవరకొండ ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతగా సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. 'కింగ్ ఆఫ్ ది హిల్' బ్యానర్ ను ఏర్పాటు చేసి, చిన్న సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఈ బ్యానర్ పై రూపొందే తొలి సినిమాలో ప్రధాన పాత్రలకి గాను, దర్శకుడు తరుణ్ భాస్కర్ ను .. యాంకర్ అనసూయను తీసుకున్న విషయం తెలిసిందే.

మరో కీలకమైన పాత్రలో తమిళ టీవీ నటి వాణి భోజన్ కనిపించనుందనేది తాజా సమాచారం. తమిళ టీవీ సీరియల్స్ ద్వారా అక్కడి బుల్లితెర ప్రేక్షకుల్లో ఈ అమ్మాయికి మంచి క్రేజ్ ఉందట. ఈ సినిమా ద్వారానే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమవుతుందన్న మాట. షమ్మీర్ దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. నిర్మాతగాను విజయ్ దేవరకొండ హిట్ కొడతాడేమో చూడాలి. 

tarun bhaskar
anasuya
vani
  • Loading...

More Telugu News