yeddyurappa: హెలికాప్టర్ ఎక్కుతుండగా యడ్యూరప్ప బ్యాగుల తనిఖీ.. వీడియో చూడండి

  • షిమోగాలో హెలికాప్టర్ ఎక్కుతుండగా అక్కడకు చేరుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్
  • బ్యాగులను తనిఖీ చేసిన అధికారులు
  • గతంలో కుమారస్వామి వాహనంలో కూడా తనిఖీలు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్పకు ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ షాకిచ్చింది. షిమోగా హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ను ఆయన ఎక్కుతుండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుంది. ఆయన వెంట తీసుకెళుతున్న బ్యాగులను తనిఖీ చేసింది. అయితే బ్యాగుల్లో ఏమీ బయటపడలేదు. తనిఖీల అనంతరం యడ్యూరప్ప హెలికాప్టర్ లో వెళ్లిపోయారు.

ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రి కుమారస్వామి వాహనాన్ని సైతం ఆపి, తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఈనెల 18న (రెండో విడత), 23న (మూడో విడత) పోలింగ్ జరగనుంది.

yeddyurappa
helicopter
ec
check
  • Loading...

More Telugu News