jagan: హీరో ఎవరో, విలన్ ఎవరో తేలిపోతుంది: డొక్కా

  • గవర్నర్ వద్ద జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే
  • వైసీపీ దాడులు ఈసీకి కనిపించడం లేదా?
  • ఈసీ, జగన్ కు మధ్య ఒప్పందాన్ని బయటపెట్టాలి

మే 23వ తేదీన ఏపీలో హీరో ఎవరో, విలన్ ఎవరో తేలిపోతుందని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గవర్నర్ నరసింహన్ వద్ద వైసీపీ అధినేత జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలే గొడవలు చేసి, వాళ్లే గవర్నర్ కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న దాడులు ఈసీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

ఈసీకి, జగన్ కు మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేంత వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం ఆగదని అన్నారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఈసీకి వచ్చిన ఇబ్బంది ఏమిటని అడిగారు. గవర్నర్ తో భేటీ అనంతరం జగన్ మీడియా సమావేశంపై స్పందిస్తూ డొక్కా పైవ్యాఖ్యలు చేశారు.

jagan
Chandrababu
dokka
Telugudesam
ysrcp
narasimhan
  • Loading...

More Telugu News