Chandrababu: మోదీ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం?

  • వారణాసిలో మోదీని చంద్రబాబు ఎండగడతారు
  • మే 23న టీడీపీ ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు తెగిపోతాయి
  • చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసీపై విమర్శలు వస్తున్నాయి

ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేయబోతున్నారా? దీనికి సమాధానంగా 'ఔనని' టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంటున్నారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసికి కూడా చంద్రబాబు వెళతారని... ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని చెప్పారు. మోదీ ద్రోహాన్ని, కుయుక్తులను వారణాసి వేదికగా ఎండగడతారని అన్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 23వ తేదీన టీడీపీ ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు తెగిపోతాయని బుద్ధా వెంకన్న అన్నారు. 23న వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఏన్నడూ రానంతగా ఈసీపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయని... దీనికి కారణం ఇది మోదీ నియమించిన ఈసీ కావడమేనని చెప్పారు. ఈసీ మద్దతుతోనే వైసీపీ అరాచకాలకు తెగబడిందని అన్నారు. అరాచకాలకు పాల్పడిన వైసీపీకే మోదీ నియమించిన గవర్నర్ కూడా అపాయింట్ మెంట్ ఇస్తారని విమర్శించారు.

Chandrababu
modi
budda venkanna
Telugudesam
ysrcp
bjp
  • Loading...

More Telugu News