Peela Govinda: ఎంత పందానికైనా రెడీ... కాసేదెవరు?: టీడీపీ గెలుపుపై అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద

  • అన్నం పెట్టిన పార్టీనే విమర్శిస్తున్నారు
  • మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపీయే
  • గెలిచిన తరువాత తానేమిటో చూపిస్తానన్న పీలా

ఈ ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశం పార్టీయేనని, ఈ విషయంలో తాను ఎంత పందెం కాయడానికైనా సిద్ధంగా ఉన్నానని, ఎవరు ముందుకొస్తారో రావాలని అనకాపల్లి ఎమ్మెల్యే, మరోసారి పోటీ చేస్తున్న పీలా గోవింద సత్యనారాయణ వ్యాఖ్యానించారు.  పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, టీడీపీ జెండాతో అధికారాన్ని అనుభవించిన కొందరు, ఇప్పుడు అన్నం పెట్టిన పార్టీనే విమర్శిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ నేతలు అతిగా ఊహించుకుంటున్నారని, మరోసారి గెలిచేది టీడీపీయేనని, తన విజయం కూడా ఖాయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. గెలిచిన తరువాత తానేమిటో చూపిస్తానని  హెచ్చరించిన ఆయన, ప్రశాంతంగా ఉన్న అనకాపల్లిలో ప్రజలను రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తిరిగి తనను గెలిపిస్తాయని పీలా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Peela Govinda
Anakapalli
Telugudesam
Bet
YSRCP
  • Loading...

More Telugu News