kodela: జయకేతనం ఎగురవేస్తాం.. 130కి పైగా స్థానాలు మావే: కోడెల

  • టీడీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
  • పోలింగ్ నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైంది
  • అర్థరాత్రి తర్వాత కూడా పోలింగ్ జరగడం ఎప్పుడైనా చూశామా?

ఏపీలో 130కి పైగా అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ జయకేతనం ఎగురవేస్తుందని... మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే భద్రతను పూర్తి స్థాయిలో మోహరించకుండా, ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారని అన్నారు. ఈవీఎంలు మొరాయించడం, పలుచోట్ల మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రారంభం కాకపోవడం దారుణమని చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ జరగడాన్ని గతంలో ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. ఈవీఎంలపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లకు కనీస అవగాహన కూడా కల్పించలేదని చెప్పారు. ఈవీఎంలు పని చేయకపోతే అప్పటికప్పుడు ప్రాథమికంగా రిపేరు చేసే విధంగా అధికారులకు శిక్షణ ఇచ్చి పంపిస్తారని... ఈ సారి అది కూడా జరగలేదని మండిపడ్డారు.

kodela
Telugudesam
ec
  • Loading...

More Telugu News