Chennai Central Railway Station: ఒక్క అక్షరం తేడాతో వరల్డ్ రికార్డును కోల్పోయిన చెన్నై రైల్వే స్టేషన్!

  • ఇటీవలే అమలులోకి వచ్చిన కొత్త పేరు
  • 57 అక్షరాలతో ఉన్న రైల్వే స్టేషన్ పేరు
  • 58 అక్షరాలతో తొలి స్థానంలో ఉన్న వేల్స్ రైల్వేస్టేషన్

ఒకే ఒక్క అక్షరం తేడాతో చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ ప్రపంచ రికార్డును కోల్పోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద పేరున్న రైల్వే స్టేషన్ గుర్తింపు దక్కకుండా పోయింది. ఇటీవల చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ పేరును "పురచ్చి తలైవర్‌ డాక్టర్‌ ఎంజీ రామచంద్రన్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌"గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే.

అయితే అత్యధిక అక్షరాలతో ఉండే రైల్వే స్టేషన్ల పేర్లలో అగ్రస్థానాన్ని చెన్నై తృటిలో చేజార్చుకుంది. 58 అక్షరాలతో వేల్స్‌ రైల్వేస్టేషన్‌ మొదటి స్థానంలో ఉండగా, 57 అక్షరాలతో చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌ రెండో స్థానంలో ఉంది. ఇక ఇండియాలో పొడవాటి పేర్లున్న రైల్వే స్టేషన్ల సంఖ్య తక్కువేమీ కాదు. కర్ణాటకలో "క్రాంతివీర సాంగొలి రాయన్న బెంగుళూరు సిటీ", ఏపీలో "వెంకట నరసింహ రాజువాణి పేట", మహారాష్ట్రలో "ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌" వంటి అధిక అక్షరాలు గల స్టేషన్లున్నాయి.

Chennai Central Railway Station
Long Name
Record
Wales
  • Loading...

More Telugu News