Hyderabad: రెండో భార్యగా వస్తావా? చావమంటావా?: మరదలిని హింసిస్తున్న బావకు అరదండాలు

  • తనను పెళ్లి చేసుకోవాలంటూ మరదలికి వేధింపులు
  • మిత్రుల సాయంతో బాధితురాలిపై ఒత్తిడి
  • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

తనను రెండో పెళ్లి చేసుకోవాలంటూ మేన మరదల్ని వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. గాంధీనగర్‌‌కు చెందిన జాకబ్ కొనికి (40) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. పెళ్లైన ఇతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను నెత్తికెత్తుకున్న మేన మరదలు (30)పై జాకబ్ కన్నుపడింది. బాధ్యతల కారణంగా పెళ్లి చేసుకోని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

తనను పెళ్లి చేసుకోవాలని, తనకు రెండో భార్యగా రావాలని వేధించసాగాడు. ఇటీవల మరింత ముందుకెళ్లి తనను పెళ్లాడకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించసాగాడు. అతడి మిత్రులైన  మెజెస్‌, సోను, సాయికుమార్‌‌లు కూడా అతడికి వత్తాసు పలికారు. బాధితురాలిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆదివారం మరోమారు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. అతడి ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతుండడంతో ఇక లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాకబ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad
Telangana
Crime News
Police
Musheerabad
  • Loading...

More Telugu News