Attach: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా ఆస్తుల జప్తు

  • 1993-2006 మధ్య రూ.6.09 కోట్ల ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణ
  • ఓం ప్రకాశ్ చౌతాలతోపాటు ఆయన కుమారులపైనా ఎఫ్ఐఆర్
  • ఢిల్లీ, పంచకుల, సిర్సాలోని ఆస్తులు స్వాధీనం

హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు చెందిన ఆస్తులను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఢిల్లీ, పంచకుల, సిర్సాలోని ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.3.68 కోట్లని ఈడీ తెలిపింది. చౌతాలాతోపాటు మరికొందరిపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈడీ స్వాధీనం చేసుకున్న వాటిలో ఫ్లాట్, స్థలం, ఇల్లు, వ్యవసాయ భూమి ఉన్నట్టు పేర్కొంది.  

మనీలాండరింగ్ కేసులో చౌతాలాతోపాటు ఆయన కుమారులు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాలాపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. 1993-2006 మధ్య చౌతాలా మొత్తం రూ.6.09 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కూడబెట్టినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది.

Attach
Money Laundering
Enforcement Directorate
Om Prakash Chautala
  • Loading...

More Telugu News