Lingampalli: ఇక లింగంపల్లి నుంచి జన్మభూమి ఎక్స్ ప్రెస్!

  • నిన్నటి నుంచి పొడిగింపు
  • ఉదయం 6.15కు బయలుదేరనున్న రైలు
  • నెరవేరిన ప్రయాణికుల డిమాండ్

ఇన్నాళ్లూ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకూ రాకపోకలు సాగించిన జన్మభూమి ఎక్స్ ప్రెస్, నిన్నటి నుంచి హైదరాబాదు శివారు లింగంపల్లి వరకూ నడవటం ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఉదయం 6.15కు ఈ రైలు బయలుదేరుతుందని, సాయంత్రానికి విశాఖ చేరుతుందని అన్నారు.

లింగంపల్లి స్టేషన్ అధికారులు, కొబ్బరికాయకొట్టి, పూజలు చేసి, ఆపై పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను లింగంపల్లి వరకూ నడిపించాలని చాన్నాళ్ల నుంచి ప్రయాణికులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారుల తాజా నిర్ణయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై రాకపోకల ఒత్తిడి తగ్గటమే కాకుండా, బేగంపేట, సనత్ నగర్, మూసాపేట తదితర ప్రాంతాల్లోని ప్రయాణికులకు ఇబ్బందులు తీరనున్నాయి.

Lingampalli
Janmabhoomi
Secunderabad
Vizag
  • Loading...

More Telugu News