Andhra Pradesh: ఎలక్షన్ కమిషన్ రాసిన కోడ్ వీవీప్యాట్స్ లో లేదు: ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరి ప్రసాద్

  • ఈసీ 7 సెకన్ల కోడ్ రాస్తే 3 సెకన్లే ఎలా కనిపిస్తుంది?
  • వీవీ ప్యాట్స్ లో  నాకు తప్పు కనపడింది
  • ఈ విషయం బయట పెట్టడం తప్పా? కరెక్టా?

ఓటర్లు తాము వేసిన ఓటును వీవీప్యాట్స్ ద్వారా చెక్ చేసుకునే సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ లో కూడా వీవీప్యాట్స్ ను ఏర్పాటు చేశారు. అయితే, దీని ద్వారా ఓటరు వేసిన ఓటు ను సరిచూసుకునేందుకు 7 సెకన్ల సమయం కేటాయించారు కానీ, 3 సెకన్ల సమయం మాత్రమే డిస్ ప్లే కావడంపై ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వీవీ ప్యాట్స్ లో 7 సెకన్ల సమయం కనిపించేలా ఎలక్షన్ కమిషన్ కోడ్ రాస్తే, 3 సెకన్లే ఎలా కనిపిస్తుంది? అని ప్రశ్నించారు. ఒకవేళ మూడు సెకన్లే డిస్ ప్లే అయ్యేట్లు కోడ్ రాయిస్తే, ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్ ముందుగానే పార్టీలకు చెప్పాలిగా? అని ప్రశ్నించారు. వీవీ ప్యాట్స్ లో తనకు తప్పు కనపడిందని, ఈ విషయం బయట పెట్టడం తప్పా? కరెక్టా? అని హరిప్రసాద్ ప్రశ్నించారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News