Telugudesam: రాళ్ల దాడి ఘటనలో 36 మందికి రిమాండ్ విధించిన పులివెందుల న్యాయస్థానం

  • పరస్పరం దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ
  • అలవలపాడు పోలింగ్ కేంద్రం వద్ద ఘటన
  • వైసీపీ, టీడీపీ వర్గీయుల అరెస్ట్

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. కడప జిల్లా వేంపల్లె మండలం అలవలపాడు పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు టీడీపీకి చెందిన 17 మందిని, వైసీపీకి చెందిన 19 మందిని మొత్తం 36 మందిని అరెస్ట్ చేశారు. వారందరినీ పులివెందుల న్యాయస్థానంలో హాజరు పరిచినట్టు వేంపల్లె అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు.

Telugudesam
YSRCP
Venkateswarlu
Pulivendula
Kadapa
  • Loading...

More Telugu News