BR Ambedkar: అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశ్రుతి.. 107 మందికి తీవ్ర అస్వస్థత

  • వేడుకల్లో పాల్గొన్నవారికి ఆహారం సరఫరా
  • ఆహారం తిన్న వారికి వాంతులు, విరేచనాలు
  • ఆసుపత్రికి తరలించిన స్థానికులు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సర్వత్రా వైభవంగా జరిగాయి. అయితే మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో మాత్రం అపశ్రుతి చోటు చేసుకుంది. జయంతి వేడుకల్లో భాగంగా హాజరైన వారందరికీ ఆహారం సరఫరా చేయగా, అది తిన్న వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న దహిహనండా పోలీసులు ఆహార నమూనాలను ల్యాబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే చికిత్స పొందిన వారిలో చాలా మంది డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారి పరిస్థితి కూడా నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

BR Ambedkar
Maharashtra
Akola
Laboratory
Police
  • Loading...

More Telugu News