Guntur District: రేపు సాయంత్రంలోగా పోలీసులు స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతాం: వైసీపీ నేత అంబటి

  • ఇనిమెట్ల ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి
  • కోడెల, ఆయన అనుచరులపై తక్షణ చర్యలు చేపట్టాలి
  • ముప్పాళ్ల ఎస్ఐ ను వెంటనే సస్పెండ్ చేయాలి

ఇనిమెట్ల ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, కోడెల శివప్రసాద్ తో పాటు ఆయన అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఇనిమెట్ల ఘటన నేపథ్యంలో తమపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం శోచనీయమని అన్నారు. టీడీపీకి వంతపాడుతున్న ముప్పాళ్ల ఎస్ఐ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రేపు సాయంత్రంలోగా పోలీసులు స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కులాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తున్నారని, ప్రజలు ఈ విషయం గమనించి సంయమనం పాటించాలని కోరారు.

Guntur District
sattenapalli
kodela
ambati
  • Loading...

More Telugu News