Cricket: రిషభ్ పంత్ కు మొండిచేయి... వివరణ ఇచ్చిన ఎమ్మెస్కే ప్రసాద్

  • కార్తీక్ కు అనుభవం ఉంది
  • ప్రస్తుతం ధోనీకి అతడే ప్రత్యామ్నాయం
  • వికెట్ కీపింగ్ ప్రతిభ కూడా పరిగణనలోకి తీసుకున్నాం

మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఇవాళ ఎంపిక చేశారు. అయితే, యువ సంచలనం రిషభ్ పంత్ కు వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కొంతకాలంగా బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్న పంత్ కు ప్రపంచకప్ బెర్త్ ఖాయం అని మాజీలు కూడా జోస్యం చెప్పారు. కానీ, తుది 15 మందిలో పంత్ కు బదులు రెండో వికెట్ కీపర్ గా దినేశ్ కార్తీక్ పేరు కనిపించడంతో క్రికెట్ పండితులు నిరాశకు గురయ్యారు. దీనిపై భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు.

ధోనీకి ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ప్రత్యామ్నాయం దినేశ్ కార్తీకే అని భావించామని, వికెట్ కీపింగ్ ప్రతిభను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ధోనీ మ్యాచ్ ఆడలేని పరిస్థితి వస్తే అతడి బదులు కార్తీక్ ను బరిలో దించుతారని చెప్పారు. ఒత్తిడిని తట్టుకుని ఆడడంలో కార్తీక్ కు మంచి అనుభవం ఉందని ఎమ్మెస్కే తెలిపారు. మరోవైపు, తెలుగుతేజం అంబటి రాయుడికి కూడా సెలక్టర్లు మొండిచేయి చూపడం పట్ల క్రికెట్ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News