surya: విడుదల తేదీని ఖరారు చేసుకున్న 'కాప్పాన్'

  • సూర్య కథానాయకుడిగా 'కాప్పాన్'
  • కీలకమైన పాత్రలో మోహన్ లాల్
  •  ఆగస్టు 30వ తేదీన భారీ విడుదల  

సూర్య తాజా చిత్రంగా రూపొందిన 'ఎన్జీకే' విడుదలకి ముస్తాబవుతోంది. మే 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా 'కాప్పాన్' కూడా చకచకా షూటింగు జరుపుకుంటోంది. కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మోహన్ లాల్ .. ఆర్య కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం సూర్య ప్రకటించాడు. తాజా రిలీజ్ డేట్ గా ఆగస్టు 30వ తేదీని ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని మార్చుకోవడానికి ఒక కారణం ప్రభాస్ 'సాహో' అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ హీరోగా చేసిన 'సాహో' తెలుగుతోపాటు తమిళంలోను ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. అందువలన 'కాప్పాన్' విడుదల తేదీని ఆగస్టు 15 నుంచి 30కి వాయిదా వేసినట్టుగా చెప్పుకుంటున్నారు. 

surya
sayesha saigal
  • Loading...

More Telugu News