amaravathi: అమరావతి నుంచి కర్ణాటకకు బయలుదేరిన చంద్రబాబు

  • కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి బహిరంగ సభ
  • పాండవ స్టేడియంలో నిర్వహించనున్న సభ
  • ఈ సభకు హాజరుకానున్న కుమారస్వామి, దేవెగౌడ

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఈరోజు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం అమరావతి నుంచి కర్ణాటకకు చంద్రబాబు బయలుదేరారు. మాండ్యా జిల్లాలోని పాండవ స్టేడియంలో నిర్వహించనున్న ఈ బహిరంగ సభలో సీఎం కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవెగౌడ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా, కర్ణాటకకు బయలుదేరి వెళ్లడానికి ముందు విలేకరులతో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ తీరుపై ఆయన మండిపడ్డారు.

amaravathi
Karnataka
Telugudesam
jds
congress
  • Loading...

More Telugu News