Andhra Pradesh: టీడీపీలో చేరాలని నాకు ఆఫర్లు వచ్చాయి.. మంత్రి పదవి సైతం ఆశచూపారు!: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • టీడీపీ నేతల మాటలను ఎవ్వరూ నమ్మరు
  • ప్రజా సమస్యలపై మాట్లాడేందుకే ఎమ్మెల్యేగా పోటీ
  • తాజా ఇంటర్వ్యూలో పలు అంశాలపై ముచ్చటించిన రోజా

టీడీపీ నేతల తీరు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. తాను వైసీపీ నుంచి గెలిచాక టీడీపీ నుంచి ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ‘మీరు అనవసరంగా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. టీడీపీలోనే ఉండి ఉంటే మీకు మంత్రిపదవులు వచ్చేవి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెనక్కి రండి’ అని చెప్పారని వ్యాఖ్యానించారు.

అయితే టీడీపీ నేతలు ఏంటో తెలిసినవాళ్లు వాళ్ల మాటలను నమ్మరని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా పలు అంశాలపై ముచ్చటించారు. ప్రజా సమస్యలపై గొంతుకను వినిపించేందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. చదువుకున్న యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
ministry
roja
  • Loading...

More Telugu News