Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం: నాగిరెడ్డి

  • ఈ నెల 18 నుంచి 20వ తేదీ లోపు నోటిఫికేషన్
  • మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తాం
  • ఎన్నికలకు 3 రోజుల ముందు బ్యాలెట్ ప్రింట్ చేస్తాం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. హైదారాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ నెల 18 నుంచి 20వ తేదీ లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ఆయన, 18న కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల గుర్తింపు జరిగిందని, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదలయ్యాక, ఎన్నికలకు మూడు రోజుల ముందు బ్యాలెట్ ప్రింట్ చేస్తామని పేర్కొన్నారు.

Telangana
mptc
zptc
nagireddy
Hyderabad
  • Loading...

More Telugu News