Andhra Pradesh: తిరుమల నాయుడిపై దాడి.. స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి!

  • దాడి జరిగిన వెంటనే బీద నాపై ఆరోపణలు చేశారు
  • ఓటమి భయంతోనే టీడీపీ తప్పుడు అభియోగాలు
  • నెల్లూరులో మీడియాతో వైసీపీ నేత

టీఎన్ఎస్ఎఫ్ నెల్లూరు అధ్యక్షుడు తిరుమల నాయుడిపై జరిగిన దాడి విషయమై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. జిల్లాలో తాను టీడీపీ నేతలను ఎన్నడూ బెదిరించలేదని కోటంరెడ్డి తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకవేళ టీడీపీ నేతలను తాను బెదిరిస్తే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. నెల్లూరులోని తన ఆఫీసులో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడారు. కాకర్ల తిరుమల నాయుడితో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు. తిరుమలనాయుడిపై దాడి జరిగిన వెంటనే టీడీపీ నేత బీద రవిచంద్ర తనపై విమర్శలు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఈ దాడి ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News