Ganta Srinivasa Rao: ఓట్ల గల్లంతు నిజమేనని ద్వివేదీ ఒప్పుకున్నారు: గంటా

  • ప్రారంభంలో 20 నుంచి 30 శాతం ఈవీఎంలు పని చేయలేదు
  • అధికారులను మార్చి భయానక వాతావరణాన్ని సృష్టించారు
  • 125 సీట్లను టీడీపీ గెలవబోతోంది

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయని స్వయంగా ఎన్నికల కమిషనర్ ఒప్పుకున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఓట్ల గల్లంతు నిజమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేదీ ఒప్పుకున్నారని తెలిపారు. 20 నుంచి 30 శాతం వరకు ఈవీఎంలు ప్రారంభంలో పని చేయలేదని అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 37వ వార్డు 209 బూత్ లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని చెప్పారు. అధికారులను మార్చి రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారని తెలిపారు.

మళ్లీ ప్రజా ప్రభుత్వానికే ఓటర్లు పట్టం కట్టబోతున్నారని గంటా చెప్పారు. 125 సీట్లతో టీడీపీ ఘన విజయం సాధించబోతోందని తెలిపారు. ఓటర్లు ఇబ్బంది పడకూడదనే టీడీపీ పోరాటం చేస్తోందని చెప్పారు. పోలింగ్ రోజున ఓటర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందన వారి బాధ్యతకు నిదర్శనమని అన్నారు.

Ganta Srinivasa Rao
Telugudesam
ec
  • Loading...

More Telugu News