ex governor khureshi: పుల్వామా ఘటనకు పథక రచన మోదీదే...మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు
- లోక్‌సభ ఎన్నికల కోసమే ఇదంతా అని ఆరోపణ
- పేలుడు పదార్థాల కారు రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించింది
- అధికారులకు తెలియకుండానే ఇది జరిగిందా?
జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామాలో పేలుడు ఘటన వెనుక పథక రచన అంతా ప్రధాని నరేంద్ర మోదీదేనని మిజోరాం మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజీజ్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ ఈ పథక రచన చేశారని ఆరోపించారు. లేదంటే అధికారులకు తెలియకుండా పేలుడు పదార్థాలతో నింపిన కారు రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించిందని ఆయన ప్రశ్నించారు. పదుల సంఖ్యలో సైనికులు చనిపోతే తాను గెలవవచ్చునని మోదీ భావిస్తే దాన్ని ఓటర్లు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇటువంటి చర్యలను ప్రజలు అంగీకరించకూడదన్నారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్‌సింగ్‌పై బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించక పోవడాన్నిఎద్దేవా చేశారు. దిగ్విజయ్‌పై ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ నేతలు దీటైన నాయకుని కోసం వెతుకుతున్నారని అన్నారు.