Telangana: తూచ్.. నా పాటను పాకిస్థానే కాపీ కొట్టింది!: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్

  • పాకిస్థాన్ పాటను నేనిప్పటి వరకూ వినలేదు
  • మరి నేను ఎలా కాపీ కొడతాను?
  • మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ ఆర్మీ గీతాన్ని కాపీ కొట్టారని పాకిస్థాన్ తాజాగా ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘దిల్ కి హిమ్మత్ వతన్.. అప్నా జస్బా వతన్.. పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ సాగే పాటను రాజాసింగ్ కాపీ కొట్టి హిందుస్థాన్ జిందాబాద్ గా మార్చారని దుయ్యబట్టింది.

రాజాసింగ్ తమ పాటను ఇలా కాపీ కొట్టినా సంతోషమేననీ, అయితే పాటను ఎక్కడి నుంచి తీసుకున్నారో కూడా చెప్పాలని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చురకలు అంటించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై రాజాసింగ్ స్పందించారు.

ఈ పాట పాకిస్థాన్ ఆర్మీకి చెందినట్లు తనకు తెలియదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ‘నేను ఇప్పటివరకూ ఆ పాటను వినలేదు. పాకిస్థాన్ వాళ్లు ఈ పాటను కంపోజ్ చేసి ఉంటారని నాకు ఎలా తెలుస్తుంది? పాకిస్థాన్ వాళ్లే నా పాటను కాపీ కొట్టి ఉండవచ్చు. ఎందుకంటే శ్రీరామనవమికి కొన్ని నెలలకు ముందే మేం పాటను రూపొందిస్తాం’ అని చెప్పారు. రాజాసింగ్ విడుదల చేసిన పాటపై సోషల్ మీడియాలో విపక్షాలు, నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు.

Telangana
BJP
rajasingh
Pakistan army song
Social Media
trolling
  • Error fetching data: Network response was not ok

More Telugu News