Putta Sudhakar Yadav: రిటర్న్ గిఫ్ట్ వారికే అందబోతోంది: పుట్టా సుధాకర్ యాదవ్!

  • 150 సీట్లను టీడీపీ గెలుస్తుంది
  • అదే కేసీఆర్, జగన్ లకు రిటర్న్ బహుమతి
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే చంద్రబాబు పోరాటం

తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ నేత జగన్ లకు అతి త్వరలో చంద్రబాబు నుంచి రిటర్న్ గిఫ్ట్ అందనుందని టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఏపీలో మరోసారి అధికారాన్ని చంద్రబాబు చేజిక్కించుకోవడమే రిటర్న్ గిఫ్ట్ గా అభివర్ణించిన ఆయన, 150 స్థానాల్లో టీడీపీ గెలవబోతున్నదని, జగన్ కు విపక్షనేత హోదా కూడా దక్కబోదని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ లతో కలిసి చేస్తున్న కుట్రల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నదే చంద్రబాబు లక్ష్యమని, అందుకోసం ఆయన పోరాడుతున్నారని అన్నారు. కేసీఆర్ వద్ద మార్కుల కోసం జగన్ ను తలసాని వెనకేసుకొస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈసీని అడ్డు పెట్టుకుని ఓటర్ల జాబితాలను మార్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, చంద్రబాబును విమర్శించడం ఏంటని మండిపడ్డారు. ఓటమి భయంతో ఉన్న జగన్, లోటస్ పాండ్ లో ఏడుస్తూ కూర్చుంటే, ఆయన్ను ఓదార్చేందుకు టీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని అన్నారు.

Putta Sudhakar Yadav
Return Gift
Telugudesam
Chandrababu
Jagan
KCR
Narendra Modi
  • Loading...

More Telugu News