prashant kishor: పీకే కుట్రల కోసం వైసీపీ రూ. 300 కోట్లు ఖర్చు చేసింది: దేవినేని ఉమ

  • టీడీపీదే గెలుపని పీకే టీమ్ చెబుతోంది
  • కుట్రలు చేసి మోదీ, కేసీఆర్, జగన్ గెలవాలనుకున్నారు
  • కేసీఆర్, కవితలు జగన్ కు ముద్దయ్యారు

ఏపీలో కుట్రలు చేసి గెలవాలని మోదీ, కేసీఆర్, జగన్ లు చూశారని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ప్రశాంత్ కిశోర్ కుట్రల కోసం వైసీపీ ఏకంగా రూ. 300 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇంత చేసినా టీడీపీనే గెలవబోతోందని అన్నారు. టీడీపీ గెలవబోతోందని ప్రశాంత్ కిశోర్ టీమ్ సభ్యులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కష్టానికి ఓటు రూపంలో ప్రజలు తీర్పిచ్చారని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తైతే ఇంకా పునాదులు కూడా వేయలేదని జగన్ మట్లాడుతున్నారని దేవినేని మండిపడ్డారు. జగన్ ఒక్కసారి కూడా పోలవరం ప్రాజెక్టును, అమరావతిని సందర్శించలేదని చెప్పారు. పోలవరంను ఆపేందుకు సుప్రీంకోర్టులో కేసులు వేసిన కేసీఆర్, కవితలు జగన్ కు ముద్దయ్యారని విమర్శించారు. పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ చేసిన కుట్రలు ఫలించలేదని... ఆ పార్టీ కుట్రలను మహిళలు తిప్పికొట్టారని అన్నారు.

prashant kishor
jagan
chandrababu
kct
kavitha
Telugudesam
TRS
ysrcp
  • Loading...

More Telugu News