Purandeswari: సీఎం చంద్రబాబుకు చురకలు అంటించిన పురందేశ్వరి

  • ఓటమిభయంతో ఇతరులపై వ్యాఖ్యలు సహజమే
  • ధైర్యం ఉంటే ఫలితాన్ని అంగీకరించాలి
  • హితవు పలికిన పురందేశ్వరి

మొన్నటి పోలింగ్ లో చర్చనీయాంశంగా మారిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అంశం ఢిల్లీకి చేరిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబునాయుడు ఈవీఎంల విషయంలో జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టి పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆయనపై ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా, ఆయన మరదలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా తప్పుబట్టారు. ఎన్నికలు, పోలింగ్ అంశాలకు సంబంధించి ఈసీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు.

ఓటమి భయంతో ఇతరులను విమర్శించడం సాధారణమైన విషయం అని అన్నారు. ధైర్యం ఉంటే ఫలితాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించాలని సూచించారు. ఓటమి అంచుల్లో ఉన్నవాళ్లే ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతూ ఆరోపణలు చేస్తుంటారని పురందేశ్వరి ఎత్తిపొడిచారు. ఎవరైనా గానీ ఫలితాన్ని హుందాగా అంగీకరించాలంటూ చురక అంటించారు.

Purandeswari
Chandrababu
  • Loading...

More Telugu News