Narasimhan: గవర్నర్‌తో భేటీ అయిన కేసీఆర్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

  • స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై చర్చ
  • మునిసిపల్ చట్టాన్ని వివరించిన కేసీఆర్
  • లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై చర్చ

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్‌కు కేసీఆర్ వివరించినట్టు తెలుస్తోంది.

అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. పాలనలో నూతనంగా తీసుకురానున్న సంస్కరణలతో పాటు మునిసిపల్ చట్టంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై కూడా గవర్నర్‌తో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.

Narasimhan
KCR
Elections
Telangana
Loksabha Elections
  • Loading...

More Telugu News