‌Assange: 'వికీలీక్స్' అసాంజే కర్మకాలిపోవడానికి ఈ ఫొటోనే కారణం!

  • ఈక్వెడార్ అధ్యక్షుడి ఫొటో లీక్
  • అసాంజే పనిగా అనుమానం
  • ఆశ్రయం ఉపసంహరణ

వికీలీక్స్ తో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన జూలియన్ అసాంజే ఎన్నో ఏళ్లుగా లండన్ లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందారు. అయితే, కొన్నిరోజుల క్రితమే బ్రిటన్ పోలీసులు ఈక్వెడార్ ఎంబసీలో ప్రవేశించి అసాంజేను బయటికి ఈడ్చుకొచ్చి మరీ అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న కారణంగానే అసాంజేకు ఆశ్రయం ఉపసంహరించుకున్నట్టు ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో ప్రకటించారు.

కానీ, అసలు కారణం మరొకటి ఉన్నట్టు తాజాగా తెరపైకి వచ్చింది. అధ్యక్షుడు లెనిన్ మొరెనో తన బెడ్ పై పడుకుని లోబ్ స్టర్ వంటి ఖరీదైన సీఫుడ్ ఆరగిస్తున్నట్టు ఉన్న ఓ ఫొటోను జూలియన్ అసాంజే లీక్ చేసినట్టు ఈక్వెడార్ వర్గాలు అనుమానిస్తున్నాయి. సీఫుడ్ తినడంలో ఆశ్చర్యం లేదు కానీ, ఈక్వెడార్ దేశం తీవ్ర దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో దేశాధ్యక్షుడు విలాసాల్లో మునిగితేలుతున్నాడు అనేలా ఆ ఫొటో ఉంది. ఈ కారణంగానే అసాంజేకు ఆశ్రయం వెనక్కితీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News