Cricket: టీమిండియా క్రికెటర్ భార్య బీజేపీలో... తండ్రి, సోదరి కాంగ్రెస్ పార్టీలో!

  • కాషాయతీర్థం పుచ్చుకున్న జడేజా భార్య రివాబా
  • తండ్రి అనిరుధ్ సింగ్, సోదరి నైనబా హస్తం పార్టీకి మద్దతు
  • జడేజా కుటుంబంలో భిన్న రాజకీయ పక్షాలు

టీమిండియాలో నమ్మకమైన ఆటగాడిగా ఎదిగిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కుటుంబంలో భిన్న పార్టీలు కొలువయ్యాయి. జడేజా భార్య రివాబా ఇటీవలే బీజేపీలో చేరింది. తాజాగా జడేజా తండ్రి, సోదరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జడేజా అర్ధాంగి రివాబా మార్చి 3న జామ్ నగర్ సిట్టింగ్ ఎంపీ పూనమ్ బెన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంది.

తాజాగా, జడేజా తండ్రి అనిరుధ్ సింగ్, సోదరి నైనబా కలావడ్ పట్టణంలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జామ్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీకి వ్యతిరేకంగా పాటిదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ తరఫున పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Cricket
Ravindra Jadeja
Congress
BJP
  • Loading...

More Telugu News