TSNF: టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడుపై హత్యయత్నం

  • ఎమ్మెల్యే కోటం రెడ్డి అనుచరుల దాడి 
  • తిరుమలనాయుడుపై రాడ్లు, కర్రలతో దాడి 
  • పరిస్థితి విషమం..ఆసుపత్రికి తరలింపు  

నెల్లూరు జిల్లా తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడుపై హత్యయత్నం జరిగింది. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తిరుమలనాయుడుపై రాడ్లు, కర్రలతో దాడికి పాల్పడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తిరుమల నాయుడిని సింహపురి ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరులో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా తిరుమలనాయుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఈ రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అంబేద్కర్ కు వైసీపీ అభ్యర్థి అనిల్ నివాళులర్పిస్తుండగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనిల్ తమను కొట్టించారని ఆరోపిస్తున్న టీడీపీ కార్యకర్తలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట అనిల్ ధర్నాకు దిగారు. 

TSNF
Nellore District
Tirumala Naidu
Telugudesam
  • Loading...

More Telugu News