Andhra Pradesh: కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూనే ఉన్నారు!: కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క

  • ఆయన రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు
  • ఈ విషయాన్నిపలుమార్లు గుర్తుచేసినా ప్రయోజనం లేకపోయింది
  • హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన టీపీసీసీ నేత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూనే ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇతర పార్టీల తరఫున గెలిచిన శాసన సభ్యులను తమ పార్టీలోకి లాక్కుంటూ కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.

ఈ విషయాన్ని పలుమార్లు కేసీఆర్ కు గుర్తుచేసినా ప్రయోజనం లేకపోయిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాల్సిందిగా పిటిషన్లు అందజేశామన్నారు.

Andhra Pradesh
KCR
Telangana
Congress
Mallu Bhatti Vikramarka
  • Loading...

More Telugu News