Chandrababu: చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు: జీవీఎల్

  • ఓటమి భయంతోనే చంద్రబాబు గగ్గోలు
  • సీఎం స్థాయి వ్యక్తి హుందాగా వ్యవహరించాలి
  • ఈసీ పై చంద్రబాబుకు గౌరవం లేదు

చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, ఓటమి భయంతోనే ఈసీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటమి భయంతోనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హుందాగా వ్యవహరించాలని, ఎన్నికల కమిషన్ పై చంద్రబాబుకు గౌరవం లేదని అన్నారు. 2014 ఎన్నికల్లో ఇవే ఈవీఎంలతో చంద్రబాబు గెలిచారని, అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడెలా వచ్చాయి? మూడు కోట్ల మంది ప్రజలకు రాని అనుమానం మీకెలా వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు.

Chandrababu
Telugudesam
bjp
gvl
mp
AP
  • Loading...

More Telugu News