Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావు తెలంగాణ ఉద్యమం టైంలో ‘జాహ్నవి’ పేరుతో ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయలేదా?: కేటీఆర్ ఆగ్రహం

  • చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు
  • 45 ఏళ్ల జగన్ హుందాగా వ్యవహరిస్తున్నారు
  • కానీ బాబు చిల్లర అరుపులు అరుస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అధికారులను ఈసీ బదిలీ చేస్తే సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలపై నిజంగా నమ్మకం ఉంటే ఢిల్లీలో వీధి నాటకాలు వేయాల్సిన అవసరం ఏంటని అడిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఏం చేశారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియా ప్రతినిధులతో కేటీఆర్ పలు అంశాలపై ముచ్చటించారు.

ఏబీ వెంకటేశ్వరావు ఆంధ్రజ్యోతి పత్రికలో జాహ్నవి అనే పేరుతో కథనాలు రాశారని కేటీఆర్ ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ ను ప్రస్తావిస్తూ.. ‘45 ఏళ్ల ఓ వ్యక్తి చాలా హుందాగా ఉన్నారు. కానీ 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తికి చిల్లర అరుపులు ఎందుకు?’ అని నిలదీశారు.

వంగివంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. దొంగఓట్లను అడ్డుకోవాలంటే ఓటర్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయాలనీ, పలు సంస్కరణలు తీసుకురావాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News